నేపాల్‌లో భారీ భూకంపం, 128 మంది మృతి.. భారత్‌పైనా ప్రభావం

నేపాల్‌లో భూకంపం ఘటనలో మృతుల సంఖ్దాయ 128కి చేరింది.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 6:40 AM IST
neapal, earth quake, 128 deaths,  bharath,

నేపాల్‌లో భారీ భూకంపం, 128 మంది మృతి.. భారత్‌పైనా ప్రభావం

నేపాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశంలో భూకంపం సంభవించింది. భూప్రకంపణల్లో మృతిచెందిన వారి సంఖ్య 128కి చేరింది. ఇంకా కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి కావడంతో పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు.

నేపాల్‌లో భూకంప సంఘటనపై స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు. అర్ధరాత్రి వేళ భూకంపం సంభవించడం వల్ల కమ్యునికేషన్ తెగిపోయింది. దాంతో.. తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రిక్కర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌లో పలు ప్రాంతాల్లో ప్రకంపణలు సంభవించాయి. భూమి కంపించడంతో ఏం జరుగుతోందో అన్న భయంతో ఢిల్లీలోని ప్రజలు అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూకి 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. కాగా..భూకంప తీవ్రతకు నేపాల్‌లో పలు ఇల్లు ధ్వంసం అయ్యాయి. రాత్రి వేళ భూకంపం సంభవించడం వల్ల అందరూ నిద్రలో ఉండిపోయారు. అలర్ట్‌ అయ్యి బయటకు పరుగులు తీసేలోపు ప్రాణ నష్టం జరిగిపోయింది. ఇక సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అర్ధరాత్రి వేళ కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని.. దాంతో రాకపోకలకూ అంతరాయం కలుగుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ సంతాపం ప్రకటించారు. గతంలో 2019లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Next Story