తెలుగురాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రల సహాయన నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  4 Sep 2024 1:32 AM GMT
తెలుగురాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టించింది. భారీ వరద వల్ల ముంపు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఎంతో మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా. వరద బాధితులను ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రల సహాయన నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా రూ.కోటి విరాళం ఇచ్చారు. నారా భువనేశ్వరి ఏకంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి వరద బాధితులకు అండగా నిలిచారు. రూ.2 కోట్ల విరాళం ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు వెల్లడించారు నారా భువనేశ్వరి. కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని ఆమె పేర్కొన్నారు. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండటమే వారికి మనం చేసే అతిపెద్ద సాయమని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాలపై ప్రభావం చూపాయన్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారి ఇబ్బందులను చూస్తే గుండెతరక్కు పోతోందని నారా భువనేశ్వరి అన్నారు. బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో చేసిన సాయం వారి జీవితాలను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చామన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు తమ మద్దతు ఎప్పికటీ ఉంటుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Next Story