కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కే

By Srikanth Gundamalla  Published on  3 Oct 2024 5:25 PM IST
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

అక్కినేని నాగచైతన్య, మాజీ భార్య సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ వల్లే ఇద్దరూ విడిపోయారని చెప్పారు. మరికొన్ని అభ్యంతకర కామెంట్స్ కూడా ఆమె చేశారు. దాంతో.. వెంటనే స్పందించిన నాగార్జున మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత ఆమె కామెంట్స్‌ను టాలీవుడ్‌ ఇతర నటులు కూడా విమర్శించారు. తాజాగా నాగార్జున మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకెళ్తున్నారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున పురువునష్టం దావా వేశారు. తన కుటుంబం పరువుకి భంగం కలిగించారని ఆయన చెప్పారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఈ వివాదం దుమారం రేగిన వెంటనే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ.. నాగార్జున మాత్రం పరువు నష్టం పిటిషన్ దాఖలుచేసి లీగల్‌గా ముందుకు వెళ్తున్నారు.

Next Story