మానవాళిని భయపెడుతోన్న ఎంపాక్స్‌ వైరస్

కరోనా తర్వాత మరో వైరస్‌ మానవాళిని భయపెడుతోంది.

By Srikanth Gundamalla  Published on  16 Aug 2024 8:05 AM IST
mpox virus, WHO ,health emergency, congo, child affected,

మానవాళిని భయపెడుతోన్న ఎంపాక్స్‌ వైరస్

కరోనా తర్వాత మరో వైరస్‌ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క కాంగోలోనే కాదు.. ఇప్పటికే ఈ ఎంపాక్స్‌ వైరస్‌ 12కి పైగా దేశాలకు పాకింది. పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా ఎంపాక్స్‌ వైరస్ కేసులను గుర్తించారు వైద్య నిపుణులు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న ప్రపంచ దేశాలను ఎంపాక్స్‌ నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.

డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్‌ వైరస్‌ను గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2022లో తొలిసారి ఎమర్జెన్సీ ప్రకటించారు. గతంలో ఈ వైరస్‌ను మంకీ పాక్స్ అని పిలిచారు. అయితే.. ఇప్పుడు ఈ కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఇటీవల ఆఫ్రికా సీడీసీ కూడా ఎమెర్జెన్సీని ప్రకటించింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటికే 17వేలకు పైగా అనుమానిత ఎంపాక్స్‌ కేసులను గుర్తించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 167 శాతం ఎక్కువ డేంజరెస్‌గా మారిందని వైద్య నిపుణులు అంటున్నారు. తాజాగా అయితే 13 దేశాలక్లో ఎంపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఎంపాక్స్ వైరస్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లేడ్-1, క్లేడ్‌ -2 రకాల వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయి. జంతువులు, వైరస్‌ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆఫ్రికాలో క్లేడ్ వన్‌ రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెంఉతోంది.

క్లేడ్-1 వేరియంట్‌ వైరస్‌ తేలికగా ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుందని చెబుతున్నారు. కాంగోలో మొదలైన ఈ వైరస్‌ దాని పొరుగు దేశాలకు వ్యాపించింది. కాంగోలో నమోదు అయిన కేసుల్లో 70 శాతం బాధితులు 15 ఏళ్ల లోపు చిన్నారులే ఉన్నారని నివేదికలు చెబుతున్నారు. ఎంపాక్స్ క్లేడ్-1 వైరస్‌ వల్ల మరణాల రేటు 3 నుంచి 4 శాతం వరకు ఉందని వెల్లడించారు. అయితే.. క్లేడ్‌-2 సోకితే మాత్రం ప్రాణాలకు పెద్దగా ముప్పు ఉండదని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వేరియంట్ తీవ్ర అనారోగ్యం కలిగిస్తుంది. కాంగోలో మొదలైన ఈ ఎంపాక్స్ వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపించడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా దేశాలు సీరియస్‌గా తీసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని అగ్రదేశాలు కోరుతున్నాయి.

Next Story