ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్‌షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 26 March 2024 1:23 PM IST
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్‌షాక్ తగిలింది. తాజాగా ఆమె ఈడీ కస్టడీ ముగియడంతో కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కవితను జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక తాజాగా కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత కుటుంబ సభ్యులతో పాటు.. బీఆర్ఎస్ నేతలు షాక్‌లో ఉన్నారు. కాగా.. ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈడీ అధికారులు, కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌పై వాదనలు వినిపించారు. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయనీ.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా పేర్కొన్నారు. ఈడీ తరఫున న్యాయవాది ఈ సందర్భంగా వాదనలు వినిపంచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందనీ.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. కాగా.... కవిత బెయిల్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని కోర్టు తెలిపింది. దాంతో... కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.