రేపు చెన్నైకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లనున్నారు.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 8:00 PM IST
MLC Kavitha,  chennai,  oct 12th,

 రేపు చెన్నైకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత 

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (గురువారం అక్టోబర్ 12వ తేదీ) తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లనున్నారు. ఏబీపీ నెట్‌వర్క్‌ నిర్వహించే సదరన్‌ రైసింగ్‌ సమ్మిట్‌ కవిత పాల్గొననున్నారు.

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. కవితతో పాటు వేదికను కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై పంచుకోనున్నారు "సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?" అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చ వేదికలో పాలుపంచుకుని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో అధికార పార్టీ గురించి కూడా చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించనున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు చేసిన సాయంపై కూడా మాట్లాడనున్నారు. చాలాకాలంగా కేంద్రం నుంచి తెలంగాణకు ఏమీ రావడం లేదని అధికార పార్టీ బీఆర్ఎస్‌ నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే.

Next Story