ఇది మనీలాండరింగ్ కేసు కాదు..పొలిటికల్‌ లాండరింగ్ కేసు: కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కలకలం రేపుతోంది.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 12:38 PM IST
mlc kavitha, comments,  ed case, delhi court ,

ఇది మనీలాండరింగ్ కేసు కాదు..పొలిటికల్‌ లాండరింగ్ కేసు: కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కలకలం రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇదే కేసులో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపర్చారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో దర్యాప్తు లోతుగా జరుపుతున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరంది. కేసులో విచారణ పురోగతిలో ఉందనీ.. పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

మరోవైపు కోర్టు హాల్‌లోకి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు, ఈడీ అధికారుల మధ్య నుంచే ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. తనని తాత్కాలికంగా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. ఈ కేసులో నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరిన చెప్పారు. ఎన్నికల సమయం కావడంతోనే ఈ కేసులో హంగామా చేస్తున్నారని కామెంట్‌ చేశారు. ఈ కేసుల మనీలాండరింగ్‌ కేసు కాదనీ.. పొలిటికల్‌ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని గుర్తు చేశారు. మరో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడనీ.. మూడో నిందితుడు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా రూ.50 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారనీ.. కేసే తప్పుడు కేసు అని క్లీన్‌గా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.


Next Story