డిసెంబరు నాటికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

By -  Nellutla Kavitha |  Published on  13 April 2022 11:43 AM GMT
డిసెంబరు నాటికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

హైద‌రాబాద్‌ పీవీ మార్గ్‌లో కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కాంస్య విగ్రహ ప‌నుల‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ తో క‌లిసి పరిశీలించారు మునసిపల్ శాఖా మంత్రి కేటీఆర్. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి అంబేద్కర్‌ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటు పడేవారికి అంబేద్కర్‌ ఆదర్శం అన్నారు KTR. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లోనే నిర్మాణం అవుతుందని, ఎనిమిది నెలలుగా విగ్రహ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారాయన. 55 అడుగులు బేస్ తో, 125 అడుగులు విగ్రహం 11 ఎకరాల్లో రెడీ అవుతోంది. 150 కోట్లతో ఈ ఏడాది డిసెంబర్ కి ప్రారంభించడమే లక్ష్యంగా పనులు పూర్తిచేస్తోంది తెలంగాణ సర్కార్.

అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణను సాధించామని, అన్ని మంచి అంశాల్లో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు KTR. ఇక్కడ ప్రతిష్టించబోయే విగ్రహం ప్రపంచంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహమని, ఇక్కడ ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ధ్యాన మందిరం, మీటింగ్ హాల్స్ నిర్మించాలని సూచనలు వస్తున్నాయని, ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు KTR. ప్రాంగణం అంతా సుందరంగా, ఆకర్షణీయంగా తీరిచిదిద్ది పర్యాటక కేంద్రం చేస్తామన్నారాయన.

Next Story