మెగా ప్రిన్సెస్‌ స్పెషల్‌ గదిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! (వీడియో)

మెగా ప్రిన్సెస్‌ కోసం ప్రత్యేక డిజైనర్‌ను నియమించి రూమ్‌ని సిద్ధం చేశారు ఉపాసన.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 12:23 PM GMT
Mega Princess, Kiln kaara, Special Room ,

మెగా ప్రిన్సెస్‌ స్పెషల్‌ గదిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! (వీడియో)

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. చాలా కాలం ఎదురుచూశాక వారి ఇంట్లో ఆడబిడ్డ అడుగుపెట్టడటంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారు. ఇక అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదొక విధంగా సోషల్‌మీడియాలో ట్రెండ్‌గా ఉంటోంది. పేరు కూడా క్లింకారా అని లలితా సహస్ర నామం నుంచి తీసుకుని పేరు పెట్టారు. మెగా అండ్ కామినేని వారసురాలు అంటే రేంజ్‌ ఉంటుంది కదా. ఈ క్రమంలోనే క్లింకారను ప్రిన్సెస్‌గా ట్రీట్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పాప కోసం ప్రత్యేక డిజైనర్‌ను నియమించి రూమ్‌ని సిద్ధం చేశారు ఉపాసన. క్లింకార రూమ్‌కు సంబంధించిన వీడియో ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఏర్పాట్లను చూసిన నెటిజన్లు వావ్‌ అంటున్నారు.

రామ్‌చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20 అపోలో ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముద్దుల వారసురాలు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఉపాసన పుట్టిల్లు అయిన కామినేని నివాసంలో ప్రత్యేక ఇంటీరియర్‌తో ఒక రూమ్‌ని సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారమ్‌ని రంగంలోకి దించి ఏర్పాట్లు చేయించారు. రూమ్‌ రూపొందించడం కోసం అమ్రాబాద్‌ ఫారెస్ట్ అండ్ వేదిక్‌ హీలింగ్ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని నిర్మించారు. కేవలం క్లింకారకు రూమ్‌ మాత్రమే కాదు.. అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ రూమ్‌ని కూడా ఇలాగే డిజైన్‌ చేశారట. ఈ విషయాలన్నింటిని ఉపాసన ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మెగా ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొన్నటి వరకు కూతురు దగ్గరే ఉన్న రామ్‌చరణ్‌ ఇప్పుడు షూటింగుల్లో పాల్గొంటున్నారు చరణ్ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.

Next Story