మీరే నిజమైన హీరో.. రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు మహేశ్‌బాబు మద్దతు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌కు షాక్‌ ఎదురైన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 9:36 AM IST
mahesh babu, tweet , wrestler, vinesh phogat,

మీరే నిజమైన హీరో.. రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు మహేశ్‌బాబు మద్దతు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌కు షాక్‌ ఎదురైన విషయం తెలిసిందే. ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఒలింపిక్స్‌ నుంచి తొలగించారు. ఫైనల్‌కు చేరిన తర్వాత ఇది జరగడంతో ఆమె పతకాన్ని కోల్పోయారు. కోట్ల మంది భారతీయుల కల కూడా చెదిరిపోయింది. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వినేష్‌కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మద్దతిస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, సమంత రుతుప్రభు, తాప్సీ పన్ను, ఫాతిమా సనాషేక్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే.. పలువురు వినేష్ ఫోగట్‌కు ధైర్యం చెప్పారు.

తాజాగా సోషల్‌ మీడియా వేదికగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మద్దతు తెలిపారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. 1.4 బిలియన్‌ హృదయాలు మీతోనే ఉన్నాయని పేర్కొన్నారు. రెజ్లింగ్‌లో ఇప్పుడు వచ్చిన ఫలితంతో సంబంధం లేదని అన్నారు. కానీ మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అతి కచ్చితంగా మీ గొప్పతనమే అన్నారు. వినేష్ ఫోగట్.. మీరొక నిజమైన చాంపియన్ అని అందరికీ తెలుసని మహేశ్‌ బాబు పేర్కొన్నారు. కష్ట సమయాల్లో మీ ధైర్యం, బలం ప్రతిఒక్కరికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప‌త‌కం వ‌చ్చిందా లేదా అన్న‌ది ముఖ్యం కాదనీ.. మీ స్ఫూర్తి మాలోని ప్ర‌తి ఒక్క‌రిలో ప్ర‌కాశిస్తుందని మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Next Story