కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 8:25 AM ISTకొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సబ స్థానాల్లో కౌంటింగ్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళే వెల్లడి కానున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే.. ఈవీఎంలలో ఓట్లను కౌంట్ చేయనున్నారు.
ఇక ఎన్నికల్లో ఎక్కడైనా ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో లోక్‌సభ స్థానాలతో పాటు.. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.