శబరిమల భక్తుల కోసం కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 11:47 AM GMT
kishan reddy, letter,  kerala cm,  ayyappa devotees,

శబరిమల భక్తుల కోసం కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్ల లేమి కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భక్తులకు శబరిమలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ సీఎంకు కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

అయ్యప్పస్వాములు 40 రోజుల పాటు ఆధ్యాత్మిక భావనతో మండల దీక్ష తర్వాత శబరిమలలో కొలువై ఉన్న స్వామివారిని దర్వించుకోవడం కోసం వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలో దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లు లేక ఇటీవల తొక్కిసలాట జరిగిన విషయాన్ని లేఖలో కిషన్‌రెడ్డి రాశారు. అందులో ఒక బాలిక చనిపోవడం బాధాకరమని అన్నారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో ప్రబుత్వం తరఫున తగిన సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బందిని నియమించాలని లేఖలో కోరారు కిషన్‌రెడ్డి. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని చెప్పారు. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని సీఎం పినరయి విజయన్‌ను లేఖలో కిషన్‌రెడ్డి కోరారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. అలాగే స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. వీలైనంత త్వరగా స్పందించి.. ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

Next Story