నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
జానీ మాస్టర్ లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 12:21 PM GMTజానీ మాస్టర్ లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తమ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఇందులో కీలక అంశాలను పేర్కొన్నారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు.. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే అమ్మాయిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని తేల్చారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పేర్కొన్నారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయమైందని పోలీసులు కోర్టులో చెప్పారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారని అన్నారు. ముంబైలో ఓ హోటల్‌లో బాధితురాలిపై 2020లో జానీమాస్టర్ లైంగిక దాడి చేశాడని పేర్కొన్నారు. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయస్సు 16 ఏళ్లని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు చెప్పారు. అయితే.. బాధితురాలిని జానీ మాస్టర్ పెళ్లి చేసుకున్నట్లు నమ్మించాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఇంటికి జానీ మాస్టర్, అతని భార్య వెళ్లి పలుమార్లు చెప్పుతో కొట్టారని సంచలన విషయాలు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.