సీనియర్‌ IAS స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యల దుమారం.. క్షమాపణలకు డిమాండ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 3:45 AM GMT
ias smita sabharwal, sensational comments,  disabled people,

సీనియర్‌ IAS స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యల దుమారం.. క్షమాపణలకు డిమాండ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం ఆమె ఎక్స్‌ వేదికగా వివాదాసపద పోస్టు పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ రాసుకొచ్చారు. సివిల్ సర్వీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగ కోటా ఎందుకని ఆమె ప్రశ్నించారు. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుందని తన ట్విటర్‌ పోస్టులో ప్రస్తావించారు. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నానని, కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్‌ సేవలను మీరు విశ్వసిస్తారా? అని స్మితా సబర్వాలు ప్రశ్నించారు. అయితే.. ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


దివ్యాంగులకు కల్పించిన రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏ అధికారంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ మాజీ సివిల్ సర్వెంట్ బాలలత ప్రశ్నించారు. ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ కోటాపై ఉన్నత బాధ్యతల్లో ఉన్న ఒక అధికారి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదున్నారు. దివ్యాంగుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వారి పట్ల చిన్నచూపు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వారు స్మితా సభర్వాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. సివిల్స్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు ఎంపిక చేసే విషయంలో ఉన్న విధానాలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మరోవైపు పూజా ఖేద్కర్ అనే ఐఏఎస్ ట్రెయినీ అంగవైకల్యం ఉందని నకిలీ సర్టిఫికెట్‌తో సివిల్ సర్వీసులోకి ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Next Story