హిప్ హాప్‌లో ఆ రికార్డు మనదే..!

అమెజాన్ మినీటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'హిప్ హాప్ ఇండియా' చరిత్ర సృష్టించింది.

By News Meter Telugu  Published on  25 July 2023 10:45 AM GMT
hip-hop performance, Guinness World Record, Amazon miniTV,

హిప్ హాప్‌లో ఆ రికార్డు మనదే..! 

అమెజాన్ మినీటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'హిప్ హాప్ ఇండియా' చరిత్ర సృష్టించింది. 1864 డ్యాన్సర్లతో హిప్-హాప్ ప్రదర్శన చేశారు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టారు.

హిప్ హాప్ ఇండియా అమెజాన్ షాపింగ్ యాప్‌లోనూ, ఫైర్ టీవీలో ఉచితంగా Amazon miniTVలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నారు. Amazon miniTV - అమెజాన్ ఉచిత వీడియో స్ట్రీమింగ్ సర్వీస్, నిస్సాన్ భాగస్వామ్యంతో, రియాలిటీ షో 'హిప్ హాప్ ఇండియా' ప్రీమియర్ రోజున, అతిపెద్ద ఆన్-గ్రౌండ్ హిప్-హాప్ డ్యాన్స్ యాక్టివిటీతో అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. మొత్తం 1864 మంది డ్యాన్సర్లు కలిసి 5 నిమిషాలకు పైగా హిప్-హాప్ డ్యాన్స్ చేసి వావ్ అనిపించారు.

ముంబైలోని ఫిలింసిటీలో ఈ ఈవెంట్ ను నిర్వహించారు. హిప్ హాప్ ఇండియా జడ్జెస్ రెమో డిసౌజా, నోరా ఫతేహి సమక్షంలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌ లో అమెజాన్ అడ్వర్టైజింగ్ హెడ్ గిరీష్ ప్రభు, నిస్సాన్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ రాజేష్ శ్రీవాస్తవ కూడా భాగమయ్యారు. సురేష్ ముకుంద్ నేతృత్వంలోని టు ది కల్చర్, డ్యాన్సింగ్ క్రూ కింగ్స్ యునైటెడ్ బృందం కూడా భాగమైంది. ఈ ఈవెంట్ లో పాల్గొనేవారిని ఒకచోట చేర్చి, కొరియోగ్రఫీ చేశారు. ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ టీ-షర్టులు, ఎనర్జీ డ్రింక్స్ అందించారు.

మునుపటి రికార్డు: 1658 మంది డ్యాన్సర్లు

USAలోని అలబామాలో 1658 మంది డ్యాన్సర్లు 2014లో అతిపెద్ద హిప్-హాప్ ప్రదర్శన ఇచ్చి రికార్డు సాధించారు. ఆ రికార్డును తాజాగా కొల్లగొట్టారు. Amazon miniTVలో వచ్చే 'హిప్ హాప్ ఇండియా' షో ఈ గ్లోబల్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కు హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేతలు సరికొత్త రికార్డ్ సాధించారని ప్రకటించగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

109 అడుగులు వెడల్పైన హ్యూమన్ మాగ్నైట్

నిస్సాన్ మ్యాగ్నైట్ కారు ఫార్మేషన్ ను డ్యాన్సర్స్ చేయడం ఈ ఈవెంట్ ప్రత్యేకం. సంగీతం ఎక్కడుంటే ఎంటర్టైన్మెంట్ అక్కడ ఉంటుంది. అచ్చం అలాగే ఈ ఈవెంట్ సాగింది. నిస్సాన్ మాగ్నైట్ 109 అడుగుల వెడల్పు గల మానవ నిర్మాణాన్ని చూపించడానికి నృత్యకారులు కలిసి వచ్చారు.

"ఇది భారతదేశం, అమెజాన్ మినీటీవీకి గర్వకారణం, మేము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాం. హిప్-హాప్ సంస్కృతి ఇప్పుడు యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచ రికార్డు సృష్టించడం ఈ డ్యాన్సర్ల వల్లనే సాధ్యమైంది, ఇది నిస్సందేహంగా అమెజాన్ అద్భుతమైన విజయం" అని గిరీష్ ప్రభు అన్నారు.

ఈ ఘనతపై నిస్సాన్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) డైరెక్టర్ - మార్కెటింగ్, ప్రొడక్ట్ & కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మోహన్ విల్సన్ వ్యాఖ్యానిస్తూ, "బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ నిస్సాన్ మాగ్నైట్ అనేక మైలురాళ్లను సాధించి హృదయాలను కొల్లగొట్టింది. దానిపై భారతీయుల్లో ప్రేమ పెరుగుతోంది. ఇప్పుడు మేము ఈ ఈవెంట్ ద్వారా అద్భుతమైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాం." అని అన్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా మాట్లాడుతూ "దేశవ్యాప్తంగా ఉన్న ఈ అద్భుతమైన డ్యాన్సర్‌లను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. హిప్-హాప్ రంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జట్టులో భాగం కావడం నాకే కాదు, అందులో పాల్గొన్న మనందరికీ గర్వకారణం. ఇది అమెజాన్ మినీటీవీ చేసిన అద్భుతమైన ప్రయత్నం, హిప్-హాప్ ఇండియాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందంగా ఉంది" అని అన్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈ ఈవెంట్ లో సందడి చేశారు. "ఇటువంటి చారిత్రాత్మక ఘట్టంలో భాగం కావడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. డ్యాన్స్ విషయానికి వస్తే, నేను కొత్త, విభిన్నమైన వాటిని ప్రయత్నించడానికి ఇష్టపడతాను. కానీ ఈ రోజు అందరం కలిసి అతిపెద్ద హిప్-హాప్ ప్రదర్శనగా ప్రపంచ రికార్డును నెలకొల్పడం నా అంచనాలను మించిపోయింది" అని చెప్పుకొచ్చింది.

Next Story