బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ అందింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 2:23 AM GMTబంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ అందింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆగస్టు 16న బంగారం, వెండి ధరలను చూసుకున్నట్లు అయితే.. ఉదయం 6.25 గంటల పాటికి 24, 22 క్యారెంట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గింది. దాంతో.. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,500 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,540కి చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 71,500కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 65,540కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,650కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,690గా ఉంది.
అయితే బడ్జెట్‌కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.75,000. అయితే బంగారంపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే బంగారం ధర పడిపోయి ఇప్పటి వరకు పాత స్థాయికి చేరుకోలేకపోయింది.
మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి రూ. 83,600కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 83,600 గా ఉంది, బెంగళూరులో రూ.79,900, విజయవాడలో రూ. 88,600, హైదరాబాద్‌లో రూ. 88,600గా ఉంది. ఇక చెన్నైలో రూ. 88,600, కేరళలో రూ. 88,600గా కిలో వెండి ధర ఉంది.