ఎవరెస్ట్ పర్వతాల గురించి అందరికీ తెలుసు. అత్యంత ఎత్తైన పర్వతాలు. వీటిని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే కొందరు పనిని చేసి రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఎవరెస్ట్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎవరెస్ట్ ఎత్తు అంతకంతకూ పెరుగుతోందట. దీనికి కారణం కూడా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఒక నది కారణంగా ఎవరెస్ట్ హైట్ పెరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరెస్ట్ కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కింద కదలికల వల్ల సాధారణంగా హైట్ పెరుగుతుంది. వాస్తవానికి ఏటా 0.4 ఎంఎం నుంచి 1 ఎంఎం వరకు మాత్రమే పెరగాలి. కానీ.. ప్రస్తుతం 0.08 ఎంఎం నుంచి 2 ఎంఎం ఎత్తు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా.. ఎవరెస్టు కింది భాగంలో నదుల ప్రవాహం పెరుగుతూ ఎవరెస్ట్ ఎత్తుకు కారణం అవుతున్నట్లు తేలింది. ఎవరెస్టుతో పాటు పక్కనున్న పర్వతాలు కూడా ప్రభావితం అవుతున్నాయని వెలడించారు.