సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 4వ తేదీనే ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అనుకున్నన్నీ సీట్లు రాకపోయినా.. మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో అధికారాన్ని మరోసారి ఏర్పాటు చేయబోతుంది. ఇక కాంగ్రెస్ గతంతో పోలిస్తే సీట్లను మెరుగుపర్చుకుంది. ఇక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన సందర్భంగా.. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎలక్షన్ కోడ్‌ను ఎత్తేవేసింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ కోడ్ ముగిసిందని ఈసీ తెలిపింది. కాగా.. మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గురువారం నాటికి ఈ కోడ్‌ను ముగించారు. దాదాపు దేశవ్యాప్తంగా 51 రోజుల పాటు ఎన్నికల కోడ్ కొనసాగింది.