పవన్‌పై పోటీకి రెడీ అంటోన్న డైరెక్టర్‌ ఆర్జీవీ

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 14 March 2024 5:55 PM IST

director ram gopal varma, tweet,  pithapuram election, pawan,

పవన్‌పై పోటీకి రెడీ అంటోన్న డైరెక్టర్‌ ఆర్జీవీ 

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే.. చర్చల తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన కాసేపటికే.. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమనిచెప్పారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌‌లోని విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా విమర్శలు గుప్పించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తాను కూడా రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘‘ఆకస్మిక నిర్ణయం..నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

వివాదాలకు కేరాఫ్ గా రామ్‌ గోపాల్‌ వర్మ అని చెబుతుంటారు. అలాంటి వ్యక్తి సడెన్‌గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాననీ.. అది కూడా పవన్ పై పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పడంతో నెట్టింగ చర్చనీయాంశం అవుతోంది. నిజంగానే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే పవన్‌ పై కేవలం విమర్శల కోసమేనా అని తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తే స్వతంత్రంగా బరిలోకి దిగుతారా? లేదా ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది తేలాలి. ఇక ఆర్జీవీ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే పోటీ చేస్తారా అని కొందరు..? ఏ పార్టీ నుంచి సార్‌ అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొందరైతే ఎందుకు పవన్‌పై పడి ఏడుస్తారంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.

Next Story