దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దోషి మృతి

దిల్‌సుఖ్‌నగర్‌లో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 9:53 AM IST
dilsukhnagar, bomb blast case, convict, dead, hospital,

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దోషి మృతి

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషిగా ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది తాజాగా మృతిచెందాడు. సయ్యద్ మక్బూల్ (52) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సయ్యద్‌ మక్బూల్‌ అనారోగ్యంతో బాధపడ్డాడు. అయితే.. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు చికిత్స అందించాడు. కానీ.. అతనూ వైద్యం జరుగుతుండగానే ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెప్పారు.

కాగా.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్‌కు దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ల ఘటనలతో సంబంధం ఉందని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. అతడిపై హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మక్బూల్‌కు జీవిత ఖైదు విధించింది. ఆరు నెలల క్రితమే ఇతనిపై హైదరాబాద్‌లో మరో కేసు కూడా నమోదు అయ్యింది. పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై మక్బూల్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు

2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు పేలాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ వద్ద ఐఈడీ పేలిన ఆరు సెకన్లకే ఏ1 మిర్చీ సెంటర్ వద్ద మరో పేలుడు జరిగింది. ఇందులో 12 మంది గాయపడ్డారు. 78 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇప్పటికీ కోలుకోలేదు. మంచానిక పరిమితం అయ్యి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. హైదరాబాద్‌లో కొద్దిరోజులు భయాందోళన వాతావరణం కనిపించింది.

Next Story