ప్రైవేట్ జెట్స్-ఐపీఎల్ టీమ్స్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు బ్యాంకులను ఎలా మోసం చేశారంటే

డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.

By News Meter Telugu  Published on  15 Jun 2023 11:40 AM GMT
Deccan Chronicle, ED, Venkatram Reddy Arrest, Bank Fraud Case

ప్రైవేట్ జెట్స్-ఐపీఎల్ టీమ్స్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు బ్యాంకులను ఎలా మోసం చేశారంటే 

డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ యాక్టు కింద ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామ్ రెడ్డి, పీకే అయ్యర్, ఆడిటర్ మణి ఊమెన్‌లను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. బెంగళూరు, తెలంగాణలో ఈ నిందితులపై సీబీఐ పలు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిందని తెలిపింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)తోపాటు పలు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. 16 బ్యాంకుల నుంచి వ్యాపారం పేరుతో రూ. 9805 కోట్ల రుణాలు తీసుకున్నారని.. అయితే, వాటి వినియోగానికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపలేదని తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పలు మార్గాల్లో మళ్లించారు. రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకున్నారు. బ్యాంకులకు రూ. 8180 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. తీసుకున్న రుణాలతో ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టారు.

బెంగళూరు, తెలంగాణలో వీరిపై సీబీఐ పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని ఈడీ వెల్లడించింది. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఆయనకు సంబంధించిన వందల కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీకి సంబంధించి CBI బెంగళూరు, తెలంగాణ పోలీసులు నమోదు చేసిన బహుళ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు 16 బ్యాంకుల నుంచి వ్యాపారం పేరుతో రూ.9,805 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటి వినియోగానికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపలేదు. ప్రకటనల పేరుతో అధిక ఆదాయం వచ్చిందని బ్యాంకులను మోసగించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పలు మార్గాల్లో మళ్లించారు. రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకున్నారు. బ్యాంకులకు రూ.8,180 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. అప్పటికే ఉన్న రుణాల చెల్లింపు కోసం కొత్త రుణాలను తీసుకున్నారు. కొత్త లోన్ తీసుకుని రీపేమెంట్ కోసం మాత్రమే 73% లోన్ డబ్బులను ఉపయోగించుకున్నారు. చివరికి ఆ రుణాలు కాస్తా నాన్ పెర్ఫార్మింగ్ ఆస్తులుగా మారాయి. అలా బ్యాంకులకు రూ.8,180 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. వెంకట్రామి రెడ్డి ప్రైవేటు విమానం కొనుగోలు చేశారని.. పీకే అయ్యర్ రూ. 30 కోట్లతో లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడీ తెలిపింది.

ఈడీ DCHL సంస్థకు, ఆ సంస్థ ప్రమోటర్లు/డైరెక్టర్ల ఆస్తులను 386.17 కోట్లు అటాచ్ చేసింది. ఈడీ ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తులలో న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులో ఉన్న 14 ఆస్తులు ఉన్నాయి. పీఎంఎల్‌ఏ కింద జరిపిన విచారణలో వారు ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని, లాభాలు, అడ్వర్టైజ్‌మెంట్ రాబడిని పెంచి కంపెనీ బ్యాలెన్స్ షీట్లను తారుమారు చేశారని గుర్తించారు. బ్యాంకులను మోసం చేసేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేశారని తేలింది.

Next Story