క్రెడిట్‌ కార్డులు తీసుకుంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్‌ కార్డులు యూజ్‌ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  4 May 2024 12:24 PM GMT
credit card, users,  mistake,

క్రెడిట్‌ కార్డులు తీసుకుంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. 

ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్‌ కార్డులు యూజ్‌ చేస్తున్నారు. కొందరైతే వీటి వల్ల అప్పులపాలు అయితే.. ఇంకొందరు సరిగ్గా వాడుతూ తమ అవసరాలను సమయానికి తీర్చుకుంటున్నారు. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం వివిధ ఆఫర్లు అంటూ చెబుతూ కార్డులను జారీచేస్తుంటారు. ఈ క్రమంలోనే క్రెడిట్‌ కార్డులను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పుకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

చాలా వరకు సమయానికి శాలరీ అందకపోవడం వల్లనో.. ఇతర కారణాల వల్లనో క్రెడిట్‌ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు. క్రెడిట్‌ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే వారు రివార్డు పాయింట్స్‌ వస్తాయ్. డైనింగ్, ట్రావెల్, కిరాణం లేదా ఇంధనం వంటి నిర్దిష్ట ఖర్చు వర్గాలకు అనుగుణంగా వివిధ రివార్డులు, ప్రయోజనాలను అందిస్తారు. ఎక్కడ ఉపయోగిస్తే రివార్డులు వస్తాయో వాటిని ముందుగా తెలుసుకోవాలి. అలా చేయడం ద్వారా క్రెడిట్‌ కార్డు దారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

ముఖ్యంగా క్రెడిట్‌ కార్డుల బిల్లులను సమయానికి చెల్లిస్తూ ఉండాలి. లేదంటే అదనపు డబ్బులను చెల్లించాల్సి వస్తుంది. ఫైన్‌ను భారీగా విధిస్తుంటారు. ఇక యాన్యువల్‌ ఫీ తక్కువగా ఉన్న కార్డులను ముందుగానే అడిగి తీసుకోవాలి. క్రెడిట్‌ కార్డును ఎంచుకున్నప్పుడు చాలా మంది పెద్ద వడ్డీ రేట్ల గురించి పట్టించుకోరు. కేవలం రివార్డ్‌లు, ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. లేకుంటే భారాన్ని మోయాల్సి ఉంటుంది. బలమైన భద్రతా ఫీచర్లతో క్రెడిట్‌ కార్డులను ఎంచుకోవాలి. ఒకేసారి వివిధ కార్డులను అస్సలు తీసుకోవడం మంచిది కాదు.

Next Story