ఆసక్తికరంగా అయిదు రాష్ట్రాల ఫలితాలు
By - Nellutla Kavitha | Published on 10 March 2022 2:02 PM ISTఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రికార్డ్ సృష్టించింది. 1985 తర్వాత, అంటే 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోంది BJP. యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. యూపీలో బీజేపీని రెండవ సారి అధికారంలోకి తీసుకురావడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక పాత్ర పోషించారు. మళ్లీ అధికారంలోకి రావాలన్నా అఖిలేష్ యాదవ్, మాయావతి ఆశలు గల్లంతయ్యాయి. త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరోసారి నిజమయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. ఇక పంజాబ్ కి సంబంధించి చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి చేజిక్కించుకుంది. మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ రెండవ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అమరీందర్ సింగ్ తో పాటుగా, ప్రస్తుత ముఖ్యమంత్రి గా ఉన్న చన్ని, ఇతర మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. మరోవైపు అమృత్సర్లో సిద్దు వెనుకంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ ను దాటి క్లీన్స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. గోవాలో క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి. అయినప్పటికీ అక్కడ బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, మణిపూర్ లో బిజెపి మరోసారి ఆధిక్యతను ప్రదర్శించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల సాధింపు దిశగా ముందుకు వెళుతోంది.