నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 8 మంది కూలీలు మృతి
Construction Building wall collapses.. 8 killed I రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. బస్ని పారిశ్రామిక
By సుభాష్ Published on
11 Nov 2020 4:47 AM GMT

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. బస్ని పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి 8 మంది కూలీలు మృత్యువాత పడగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకసారి 8 మంది కూలీలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలతో దద్దరిల్లిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.40వేల చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story