వారికి పండగ బోనస్.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.85వేలు
కోల్ ఇండియా యాజమాన్యం బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌ను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 7:26 AM ISTవారికి పండగ బోనస్.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.85వేలు
కోల్ ఇండియా యాజమాన్యం బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్‌ఆర్) దీపావళి బోనస్‌ను ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలో ఉన్న సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందించనుంది కోల్ ఇండియా. ఈ మేరకు ఆదివారం డిల్లీలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఒక్కొక్క కార్మికుడికి రూ.85వేల చొప్పున బోనస్ అందించాలని కోల్ ఇండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
బొగ్గు గని కార్మికులకు ప్రతి ఏడాది ఈ పీఎల్‌ఆర్‌ను అందిస్తారు. ఈ క్రమంలో గత ఏడాది కంటే ఈ దీపావళికి బోనస్ ఎక్కువగానే ప్రకటించింది యాజమాన్యం. గతేడాది బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించిగా.. ఈ సారి రూ.8,500 పెంచి రూ.85వేలు చొప్పున చెల్లిస్తామని యాజమాన్యం ప్రకటించింది. పీఎల్‌ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు దీపావళికి వారం, పదిరోజుల ముందు చెల్లిస్తారు.. ఇక ఇతర ప్రాంతాల వారికి మాత్రం దసరా ముందే చెల్లించనుంది కోల్ ఇండియా యాజమాన్యం.
కాగా.. ఢిల్లీలో ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో కోల్ ఇండియా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. చర్చల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో లక్షా 20వేల రూపాయలు పీఎల్‌ఆర్ బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు పట్టుబట్టారు. అయితే.. దానికి కోల్ ఇండియా యాజమాన్యం రూ.79,500 చెల్లిస్తామని ప్రతిపాదన ముందుంచింది. దీనిపై కార్మిక సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో రూ.76,500 ఇచ్చారని.. కేవలం రూ.3వేల పెంచితే ఊరుకోబోమని అన్నారు. పీఎల్‌ఆర్‌ను ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు. దాంతో.జ. తర్జనభజర్జనల అనంతరం బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ రూ.85వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.