తెలుగుజాతి ఒక పెద్దను కోల్పోయింది: చిరంజీవి

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 11:21 AM GMT
Chiranjeevi, condolences,  ramoji rao,

 తెలుగుజాతి ఒక పెద్దను కోల్పోయింది: చిరంజీవి 

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తాజాగా ఫిలింనగర్‌ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు.

ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి.. రామోజీరావు కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధనాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందరూ రామోజీరావులో గాంభీర్యాన్ని చూస్తారనీ.. కానీ తాను మాత్రం రామోజీరావులో ఒక చిన్నపిల్లాడిని చూశానని చిరంజీవి చెప్పారు. తాను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రామోజీరావు సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పారు. అయితే.. ఆ సమయంలో తను ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుని సంబరపడ్డారని తెలిపారు. అంతేకాదు.. ఆయన దాచుకున్న పెన్నులను కూడా చూపించారని చిరంజీవి చెప్పారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు ఎప్పుడూ సమాజహితం కోసం పనిచేశారని అన్నారు. సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో చూపించారని రామోజీరావుని చిరంజీవి కొనియాడారు.

Next Story