అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్
చంద్రబాబుతో ములాఖత్ అంశంపై రజనీకాంత్ స్పందించారు. ఎందుకు కలవలేకపోయారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla
అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో సూపర్ స్టార్ రజనీకాంత్ ములాఖత్ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. రజనీకాంత్ రాజమండ్రి జైలుకు రాలేదు. తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అంశంపై రజనీకాంత్ స్పందించారు. ఎందుకు కలవలేకపోయారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని రజనీకాంత్ కలుస్తారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే రజనీకాంత్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం లేదని ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు. అయితే తాజాగా ఈ అంశంపై రజనీకాంత్ స్పందించారు. చంద్రబాబుని కలిసేందుకు రాజమండ్రి జైలుకి వెళ్లాలనుకున్నా కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని రజనీకాంత్ చెప్పారు. ఆదివారం తలైవా ఆదివారం ఉదయం తమ కుటుంబ సభ్యుల కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను మీడియా ప్రతినిధులు కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ అంశంపై ఆయన్ని ప్రశ్నించారు.
అంటే చంద్రబాబును కలిసేందుకు రజినీకాంత్ ప్రయత్నించారనే ప్రచారం జరగడం నిజమేనని తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు, రజనీకాంత్ మధ్య దశాబ్ధాలుగా ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సైతం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చంద్రబాబును అరెస్ట్ అయినప్పుడు రజినీకాంత్ ఫోన్‌లో లోకేశ్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.