ప్రపంచ కుబేరుల్లో మనవాళ్లు ఎంతమందంటే …
By - Nellutla Kavitha | Published on 16 March 2022 2:04 PM GMTబ్లూమ్ బర్గ్ ప్రతి ఏటా విడుదల చేసే ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాని ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. బ్లూమ్బర్గ్ ప్రతియేటా బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ను రిలీజ్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో స్పేస్ అధినేత ఎలాన్ మస్క్ 199 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 166 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. గత ఏడాది వరకు టాప్ టెన్ లో కొనసాగిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆ స్థానాన్ని కోల్పోయారు. ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్నా జుకర్బర్గ్ నికర ఆదాయం 71.1 బిలియన్ డాలర్లు.
అత్యంత ధనవంతుల టాప్ టెన్ జాబితాలో ఎనిమిది మంది అమెరికన్లే ఉండడం విశేషం. ఇక మూడవ స్థానంలో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్, నాల్గవ స్థానంలో బిల్గేట్స్, ఐదవ స్థానంలో వారెన్ బఫెట్, ఆరవ స్థానంలో లారీ పేజ్, ఏడవ స్థానంలో సెర్గీ బ్రిన్, ఎనిమిదవ స్టీవ్ బాల్మర్, తొమ్మిదవ ప్లేస్లో లారీ ఎలిసన్ ఉన్నారు. ఇక భారతదేశం నుంచి 46 వ స్థానంలో శివ నాడార్ ఉండగా కొత్తగా ఈ జాబితాలో చేరిన భారతీయుల్లో ఇన్స్టిట్యూట్ పూనావాలా 55 వ స్థానం, నైక్ ఫాల్గుని నాయక్ 60 వ స్థానం, ఎస్పీ సింధుజ 67 వ స్థానంలో నిలిచారు.