బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్‌లో వీళ్లు ముగ్గురూ ఉన్నారు..!
బిగ్‌బాస్ సీజన్-7కు సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతోంది. తాజాగా ముగ్గురు కంటెస్టెంట్లు ఈసారి షోలో పాల్గొంటున్నారని చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 10:53 AMబిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్‌లో వీళ్లు ముగ్గురూ ఉన్నారు..!
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్‌బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ సీజన్-7కు అన్ని సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొనేది ఎవరో అంటూ పలువురి పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా మరో ముగ్గురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీరుముగ్గురూ కచ్చితంగా బిగ్‌బాస్‌లో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్‌బాస్ వన్ నుంచి వరుసగా ఆరు సీజన్లు ప్రజలను అలరించాయి. కొందరు మాత్రం ఈ షోపై విమర్శలు చేసినా.. ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అశ్లీలత ఎక్కువ అయ్యిందంటూ కొందరు కామెంట్స్ చేశారు.. కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కూడా దీనికి సంబంధించిన సెన్సార్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ షో ప్రసారానికి ముందే సెన్సార్ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇలా ఎన్ని వివాదాలు ఉన్నా.. బిగ్‌బాస్ సీజన్-7లో కంటస్టెంట్లు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతూనే ఉంది. కంటస్టెంట్లకు సంబంధించిన లిస్ట్‌పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురి పేర్లు కచ్చితంగా షోలో ఉంటారని చెబుతున్నారు. జబర్దస్త్ వర్ష, నేను స్టూడెండ్ సర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాథిక రోస్, ఆట సందీప్ ఈ సీజన్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌లో హీరోయిన్లు, జంటలను, కొరియోగ్రాఫర్లు, జబర్దస్త్ వంటి పలు కార్యక్రమాల నుంచి కంటస్టెంట్లను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్ష, హీరోయిన్ రాథిక రోస్, ఆట సందీప్‌ను కూడా ఈసారి బిగ్‌బాస్‌కు ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక వీరితో పాటు ఇంకొందరి పేర్లు కూడా బిగ్‌బాస్ లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. మొత్తానికి సెప్టెంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉన్న బిగ్‌బాస్ సీజన్-7కు సంబంధించిన సభ్యుల లిస్ట్ గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్-7 సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేశారు. ఈసారి కూడా నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఇటీవల విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈసారి కొత్త గేమ్స్... టాస్క్‌లు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే కంటస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.