బెంగళూరు రేవ్‌పార్టీలో పట్టుబడ్డ తెలుగు టీవీ నటులు.. హేమ క్లారిటీ
వీకెండ్ అంటే చాలు పార్టీలు.. పబ్‌లు.. రిసార్ట్‌లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు నేటి యువత.
By Srikanth Gundamalla Published on 20 May 2024 11:59 AM ISTబెంగళూరులో రేవ్‌పార్టీలో పట్టుబడ్డ తెలుగు టీవీ నటులు.. హేమ క్లారిటీ
వీకెండ్ అంటే చాలు పార్టీలు.. పబ్‌లు.. రిసార్ట్‌లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు నేటి యువత. అంతేకాదు.. సినీ ప్రముఖులు కూడా వీక్ అంతా కష్టపడి వీకెండ్స్‌లో ఖాళీ దొరికితే పార్టీలకంటూ బయటకు వెళ్తుంటారు. సీక్రెట్ ప్లేసుల్లో రేవ్ పార్టీలు చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగిపోతారు. ఇలాంటి రేవ్ పార్టీనే తాజాగా బెంగళూరులో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న పలువురు తెలుగు టీవీ నటులు పట్టుబడినట్లు తెలుస్తోంది.
బర్త్‌డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు దగ్గర ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జీఆర్ ఫామ్‌హౌజ్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇక రేవ్ పార్టీ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేశారు. పార్టీలో మద్యంతో పాటు పెద్దఎత్తున డ్రగ్స్‌ను కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలుగు టీవీ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలుర, మోడళ్లు.. బడాబాబులు ఉన్నారని చెబుతున్నారు. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి వెళ్లారట. మొత్తం అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇక అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ కూడా వెళ్లిందని సోషల్ మీడియాతో పాటు కన్నడ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి. దాంతో.. ఆమె పేరు మార్మోగిపోతుంది. ఈక్రమంలోనే తాజాగా నటి హేమ స్పందించారు. ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఇష్యూలోకి తనని అనవసరంగా లాగొద్దని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నానని ఓ వీడియోను విడుదల చేశారు.