ఈ నెల 22న బ్యాంకులకు సెలవా? కాదా?

ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 4:45 PM IST
ayodhya, ram  mandir, january 22nd, banks,

ఈ నెల 22న బ్యాంకులకు సెలవా? కాదా? 

ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పెద్ద ఎత్తున రానున్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను మోహరింపజేశారు. అయితే.. రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉదయం పూట అధికారికంగా సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి ఆఫీసులు పని చేయనున్నాయి. మరి ఆ 22వ తేదీన బ్యాంకులు పనిచేస్తాయా? లేదా అన్నది కన్ఫ్యూజన్‌గా మారింది.

అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యలయాల్లా సగం రోజు పనిచేస్తాయా? లేదంటే సెలవు ఉంటుందా అని ప్రజలు అయోమయంలో ఉన్నారు. కాగా.. కేంద్రం బాటలోనే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అరపూట సెలవు ఇచ్చాయి. ఈ జాబితాలో రాజస్థాన్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా బ్యాంకులు కూడా అధికారికంగా సెలవు ఉంటుందని ఎలాంటి ప్రకటన చేయలేదు.

కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా సగం రోజు సెలవు అంటే.. జనవరి 22న మధ్యాహ్నం 2 గంటల తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆఫీసులు తెరుచుకుంటాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంటలోపు పూర్తవుతుంది. ఆరోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని.. ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. దాంతో.. ఇళ్ల దగ్గరే అయోధ్యలోని రాములోరి విగ్రహ ప్రతిష్ట చూసి..భోజనాలు చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయన్నమాట. మరి కేంద్రం మాదిరే బ్యాంకులు కూడా సగం రోజు నుంచే ప్రారంభం అవుతాయా? లేదంటే.. సెలవు ప్రకటిస్తారా తెలియాల్సి ఉంది.

Next Story