మరోసారి ట్వీట్ చదవండి.. డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్

తిరుమల లడ్డు వివాదం మరింత తీవ్రం అవుతోంది. తాజాగా ఈ విషయంలో సినిమా రంగం కూడా విమర్శలకు తావిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2024 4:42 PM IST
మరోసారి ట్వీట్ చదవండి.. డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్

తిరుమల లడ్డు వివాదం మరింత తీవ్రం అవుతోంది. తాజాగా ఈ విషయంలో సినిమా రంగం కూడా విమర్శలకు తావిస్తోంది. నటుడు ప్రకాశ్ రాజ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. పవన్‌ కల్యాణ్‌ ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రకాశ్‌ రాజ్‌కు పవన్ కూడా కౌంట్ ఇచ్చారు. మరోసారి ప్రకాశ్‌ రాజ్‌ పవన్ కల్యాణ్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమాలు చేసిన అనంతరం మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధముందని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే టూవే అని వన్ వే కాదంటూ హితవు పలికారు. ప్రకాష్ రాజ్ మీద గౌరవం ఉందని.. ఇలా మాట్లాడి తగ్గించుకోవద్దంటూ సూచించారు.

తాజాగా పవన్ కు ప్రకాశ్ రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను చెప్పినదానికి పవన్ అర్థం చేసుకున్నదీ తెలిసి ఆశ్చర్యమేస్తోందన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన త్వరలోనే ఇండియా వస్తానని చెప్పారు. ఆ తర్వాత సమాధానాలు ఇస్తాననిపేర్కొన్నారు. ఆలోపు వీలైతే తన ట్వీట్‌ను మరోసారి చదువుకుని అర్థం చేసుకోవాలంటూ ప్రకాశ్‌ రాజ్ కౌంటర్ వేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై జనసేన శ్రేణులు రియాక్టవుతున్నాయి. ట్వీట్‌ను తాము సరిగానే అర్థం చేసుకున్నామని.. దయచేసి కేంద్రంపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని అందరిపై రుద్దకండి అంటూ పేర్కొంటున్నారు.


Next Story