వైభవంగా జరిగిన అనంత్-రాధిక పెళ్లి, వేడుకలో ప్రముఖుల సందడి

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on  13 July 2024 7:43 AM IST
anant ambani, Radhika merchant, marriage, Mumbai,

 వైభవంగా జరిగిన అనంత్-రాధిక పెళ్లి, వేడుకలో ప్రముఖుల సందడి

తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉండే అభ్యర్థులు.. ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావొచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయంపై అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు.

అయితే.. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్‌లోకల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చాయి. దాంతో.. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక వారికి హాల్‌టికెట్లు మార్చి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ వెల్లడించింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు 2.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు హాల్‌టికెట్స్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

Next Story