అనంత్, రాధిక పెళ్లిలో స్నేహితులకు అదిరే గిఫ్ట్‌లు

అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 1:30 PM IST
anant ambani, marriage, costly watch gifts ,

అనంత్, రాధిక పెళ్లిలో స్నేహితులకు అదిరే గిఫ్ట్‌లు

అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ముంబైలో ఈ వేడుక జరిగింది. అయితే.. ఈ వివాహం కోసం అంబానీ ఫ్యామిలీ ఏకంగా రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ.. ప్రచారం జరుగుతోంది. అయితే. ఈ వివాహం సందర్భంగా స్నేహితులు, బాలీవుడ్ హీరోలకు అనంత్‌ అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చారు.

అనంత్ అంబానీ తన స్నేహితులకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు విలువైన బంగారు వాచ్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చాడు. ఆడెమర్స్ పిగ్వేట్ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను బహుమతులుగా అందించాడు. ఈ కాస్ట్‌లీ వాచీలను అందుకున్న వారిలో బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నారు. ఇందుల 41 ఎంఎం 18 క్యారెట్ల పింగ్‌ గోల్డ్‌ కేస్, సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్‌ క్రోన్‌ ఉన్నాయి. గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ తో పొదిగిన నెంబర్లు ఉన్నాయి. ఈ ఆటోమెటెడ్ వాచీ వారం, రోజు, తేదీ, ఖగోళ చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ను కలిగి ఉంటుంది.

ఈ గిఫ్ట్‌లు అందుకున్న అందరూ కలిసి వాచ్‌లు కనపడేలా ఫొటో తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనంత్‌ అంబానీ లాంటి స్నేహితుడు ఉంటే చాలంటూ చెబుతున్నారు. ఇలాంటి రిచెస్ట్‌ మ్యారేజ్‌లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అనంత్, రాధిక పెళ్లితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ముంబై వైపు చూసిందని చెప్పుకొస్తున్నారు.

Next Story