ఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయా? సెప్టెంబర్‌లో 14 రోజులు సెలవే!
బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:45 AM ISTఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయా? సెప్టెంబర్‌లో 14 రోజులు సెలవే!
బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. బ్యాంకుల కస్టమర్లు ఇబ్బందులు పడకుండా.. ముందుగానే సమాచారం తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించేందుకు ఈ ప్రకటన చేస్తుంటింది. ఎవరి సమయం వృధా కాకుండా.. కొందరు ఆర్థికంగా నష్టపోకుండా ప్రతి నెలా పని చేసే తేదీలను ప్రకటిస్తుంది. అయితే.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశీయ బ్యాంకులు నెలలో రెండు, నాలుగో శనివారాలు పని చేయవు. అలాగే ఆదివారాలు, ఇతర ప్రాంతీయ, జాతీయ సెలవు దినాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే.. ఆగస్టు నెలలో వచ్చిన ఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయా అని చాలా మందిలో సందేహం ఉంది. దేశంలోని బ్యాంకులు మొదటి, మూడో శనివారాలకు అదనంగా ఐదో శనివారం తెరిచి ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. నిర్ణీత సెలవురోజు లేకుంటే బ్యాంకులు ప్రతి మొదటి, మూడో, ఐదో శనివారం పనిచేస్తాయని కస్టమర్‌లు తెలుసుకోవాలని చెప్పింది.
ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు పెద్ద ఎత్తున సెలవులు ఉన్నాయి. ఇందులో శని, ఆదివారాలను కలుపుకొంటే ..ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడే ఉండనున్నాయి. వరుసగా సెలవు దినాలను చూసుకుంటే.. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. అలాగే.. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూడు రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో 16న ఈద్ మిలాద్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి.ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు. కర్ణాటకలో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి.