జూలై 25న ప్రమాణ స్వీకారం చేసిన పదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu Takes Oath On July 25 - She is the tenth successive president since 1977 to be sworn in on the same date.

By -  Nellutla Kavitha |  Published on  25 July 2022 7:50 AM GMT
జూలై 25న ప్రమాణ స్వీకారం చేసిన పదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారతదేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ఆదివాసి మహిళగా చరిత్రకెక్కారు ద్రౌపది ముర్ము. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్రలో నిలిచిపోతారు, మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా దేవి పాటిల్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జన్మించిన వ్యక్తి రాష్ట్రపతి కావడం ఇదే తొలిసారి. దీంతో పాటుగానే దేశానికి స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంలో, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆజాదీ గా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న వేళ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జూలై 25కు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జూలై 25 వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 1977 నుంచి వరుసగా ప్రతి రాష్ట్రపతి ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మాత్రం జూలై 25న ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక ఆ తర్వాత దేశానికి ఆరవ రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి జూలై 25 1977 న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇదే రోజున ప్రమాణ అందరు రాష్ట్రపతులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

రాష్ట్రపతుల పదవీకాలం ఒకసారి పరిశీలిస్తే…రాజేంద్ర ప్రసాద్ జనవరి 26 1950 న అంటే గణతంత్ర దినోత్సవం రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత సెకండ్ టర్మ్ కూడా ఆయనే రాష్ట్రపతిగా పనిచేశారు. ఇక మే 13, 1962న సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్రపతిగా మే 13, 1967 వరకు కొనసాగారు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్, ఫకృద్దీన్ అలీ అహ్మద్ అనారోగ్య కారణాల వల్ల మరణించడంతో, రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత నీలం సంజీవరెడ్డి జూలై 25 1977 ఆరవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రపతులు వరుసగా జ్ఞానీ జైల్ సింగ్, ఆర్.వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కె.ఆర్.నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, ఇటీవల రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందిన రామ్నాథ్ కోవింద్ జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదీ ముర్ము కూడా అదే ఈ సంప్రదాయాన్ని కొనసాగించినట్లు అయింది.

అయితే జూలై 25 నే రాష్ట్రపతుల ప్రమాణస్వీకారానికి సంబంధించి ఎలాంటి నియమం లేనప్పటికీ అది ఒక ఆనవాయితీగా వస్తోంది. రికార్డులను బట్టి చూస్తే జూలై 25న ప్రమాణ స్వీకారం చేసే సంప్రదాయం 1977 నుంచి ఈరోజు వరకు కొనసాగుతూ కనిపిస్తోంది.

Next Story