టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్-2019 కిరీటాన్ని దక్కించుకున్న దిశా పటానీ
By సుభాష్ Published on 29 Aug 2020 11:42 AM IST2019 సంవత్సరానికి గానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్టులో బాలీవుడ్ భామ దిశా పటానీ టాప్ లో నిలిచింది. www.toi.in/mostdesirablewomen లో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో పలువురు ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే జ్యురీ సభ్యులు కూడా తమ ఓటింగ్ ని వినియోగించుకున్నారు.
40 సంవత్సరాల వయసు లోపల ఉన్న మహిళలను ఈ లిస్టులో ఉంచారు. భారత దేశంలో వివిధ రంగాలలో తమ ట్యాలెంట్ ను చూపిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకున్న వారిని డిజైరబుల్ విమెన్ లిస్టులో చేర్చుతారు. గ్రేట్ లుక్స్, కాన్ఫిడెంట్, ట్యాలెంట్, స్టైల్ వంటివి పరిగినలోకి తీసుకుంటారు. గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలిచిన వారు ఈ లిస్టులో చోటు సాధిస్తూ ఉంటారు. 2019 సంవత్సరానికి గానూ దిశా పటానీ ఆ లిస్టులో టాప్ లో చోటు సంపాదించింది. భాగీ 3, మలంగ్ సినిమాలలో నటించిన దిశా పటానీ తన గ్లామర్ తో అందరి మనసును దోచుకుంది.
మొదటి స్థానం: దిశా పటానీ
ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని దిశా పటానీ తెలిపింది. తాను ఫిట్ గా ఉండడం, నాలాగే నేను ఉండడం నచ్చడం వలనే తనకు ఈ అవార్డు లభించి ఉంటుందని దిశా తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన మీద కురిపిస్తున్న ప్రేమ కారణంగా ఇది సాధించగలిగానని చెబుతోంది దిశా. తాను ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి తన తల్లి, చెల్లెలు అని చెబుతోంది దిశా పటానీ.. నాలోని బెస్ట్ క్వాలిటీని బయటకు తీసుకుని రావడానికి వారు ఎంతో దోహద పడ్డారని ఆమె చెబుతోంది. ఇక తనతో పని చేసిన చిత్ర దర్శకులు, ఫిలిం మేకర్స్, నా టీమ్ తో పాటూ నన్ను ప్రేమించిన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపింది. అభిమానులను అలరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటానని తెలిపింది.
రెండో స్థానం: సుమన్ రావు
2019 మిస్ వరల్డ్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది ఈ 21 సంవత్సరాల అమ్మాయి. ఫెమినా మిస్ రాజస్థాన్ 2019, ఫెమినా మిస్ ఇండియా 2019 పతకాలను సాధించింది. అలాగే పలు టీవీ కమర్షియల్స్ లోనూ, ఫ్యాషన్ ఈవెంట్స్ లోనూ షోస్టాపర్ గా నిలిచింది. అద్భుతమైన లుక్స్ మాత్రమే కాదు.. మంచి కథక్ డ్యాన్సర్ కూడా..!
మూడో స్థానం: కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జీరో, భరత్ సినిమాలలో కత్రినా కైఫ్ తన నటనతో ఆకట్టుకుంది. సెక్సీ లుక్స్ మాత్రమే కాదు అమ్మడు డ్యాన్స్ కూడా అద్భుతంగా చేస్తుంది.
నాలుగో స్థానం: దీపిక పదుకోన్
దీపిక పదుకోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతోంది. మహారాణి పాత్ర దగ్గర నుండి అల్ట్రా గ్లామరస్ రోల్ ను కూడా దీపిక చేయగలదు. ఇటీవలే చపాక్ సినిమాలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. తన కళ్ళతోనూ, సొట్ట బుగ్గల స్మైల్, సూపర్ ఫ్యాషన్ సెన్స్, గ్రేస్ ఆమె సొంతం.
ఐదో స్థానం: వర్తిక సింగ్
మిస్ యూనివర్స్-2019 లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. రాంప్ మీద తన వాకింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకోగలదు. ఆమె పలు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి యువతను తన వైపు తిప్పుకుంది. చదేయ ఫితూర్, కిశ్మిష్ లాంటి పాపులర్ మ్యూజిక్ వీడియోలలో నటించింది. పలు బ్రాండ్ లకు అమ్మడు క్యాంపెయిన్ చేసింది.
ఆరో స్థానం: కియారా అద్వానీ
కియారా అద్వానీ అంటేనే క్యూట్ నెస్ కు, హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. ఇక బాలీవుడ్ లో కూడా ఆమె పలు హిట్స్ లో నటిస్తూ అందరినీ అలరిస్తోంది. గుడ్ న్యూస్, కబీర్ సింగ్ సినిమాలు భారీ హిట్స్ అందుకున్నాయి. ఇక తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ ఆకట్టుకునే కియారా.. ఎంతో మందికి క్రష్ గా నిలిచింది.
ఏడో స్థానం: శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి దక్షిణాదిన కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన 'చిచోరే' సినిమాలో కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. ఇక డ్యాన్స్ కూడా శ్రద్ధా కపూర్ అద్భుతంగా చేస్తుందనడానికి ఆమె చేసిన సినిమాలే ఉదాహరణ.
ఎనిమిదో స్థానం: యామీ గౌతమ్
యురి: సర్జికల్ స్ట్రైక్స్ సినిమాలో నటించింది యామీ గౌతమ్.. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా సినిమాలో కూడా యామీ యాక్టింగ్ కితకితలు పెడుతుంది. పలు యాడ్స్ లో నటిస్తూ.. ఈవెంట్స్ లో పాల్గొంటూ అందరినీ అలరిస్తోంది.
తొమ్మిదో స్థానం: అదితి రావు హైదరీ
చెన్నై టైమ్స్ టాప్ 30 మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్టులో అదితి టాప్ లో నిలిచింది. గత ఏడాది అదితి నాలుగు సినిమాల్లో నటించింది. తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన 'వి' తెలుగు సినిమా విడుదల కాబోతోంది.
పదవ స్థానం: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ సాంగ్ లో జాక్వెలిన్ అందానికి ఫిదా అవ్వంది ఎవ్వరు చెప్పండి. ఆమె క్యూట్ నెస్ కు హాట్ నెస్ మిక్స్ అయ్యి కుర్రకారును గిలిగింతలు పెడుతూ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన అమ్మడు 'డ్రైవ్' సినిమాలో నటించింది. ఫిట్నెస్ వీడియోలతోనూ.. అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్ లతోనూ జాక్వెలిన్ అలరిస్తూ ఉంది.