'చూసీ చూడంగానే' న‌చ్చుతుందా..?

By Newsmeter.Network  Published on  4 Dec 2019 6:04 AM GMT
చూసీ చూడంగానే న‌చ్చుతుందా..?

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చూసీ చూడంగానే'. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ 'పెళ్ళిచూపులు', 'మెంటల్ మదిలో'చిత్రాలను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ద్వారా రాజ్ కందుకూరి, తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు.

ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఫ్రెష్ అండ్ కూల్ అనిపించేలా ఈ ట్రైల‌ర్ ఉంది. అయితే.. కాలేజీ, ల‌వ్, బ్రేక‌ప్... ఇలా యూత్ కి క‌నెక్ట్ అయ్యే క‌థాంశంతోనే ఈ సినిమా తీసిన‌ట్టు అనిపించినా కొత్త‌ద‌నం ఉన్న‌ట్టుగా ఏమీ అనిపించ‌డం లేదు. మ‌రి.. ట్రైల‌ర్ లో చూపించ‌క‌పోయినా సినిమాలో చూపిస్తారేమో చూడాలి.

Next Story
Share it