హీరోలకు పోటీ తప్పింది.. కానీ రేట్లు పెరిగాయి.!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 10:11 AM GMT
హీరోలకు పోటీ తప్పింది.. కానీ రేట్లు పెరిగాయి.!

సంక్రాంతి సీజన్ అంటే సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్ల పండగే. అందుకే డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలను అమాంతం పెంచేసి సంక్రాంతి హడావుడిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టికెట్ ధరలను రెట్టింపు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ టికెట్ ధరను రూ.250కు.. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరను రూ.200కు పెంచనున్నారు. ఈ ధరల వ్యవహారం గురించి ఇప్పటికే సంభందిత అధికారుల నుండి అధికారికంగా అనుమతులు కూడా వచ్చేశాయట. వాళ్ళదేం పోయింది.. పోయేది సినిమాని చూసే ప్రేక్షుకులదేగా. అన్నట్టు తెలంగాణలో ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 వరకు పెరిగాయి.

ఇక సంక్రాంతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురములో' సినిమాలు పోటాపోటీగా విడుదల విషయంలో వెనుకతగ్గని సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు గిల్డ్ కమిటీ రెండు సినిమాల హీరోలతో నిర్మాతలతో మాట్లాడి ఇద్దరూ హీరోల మధ్య పోటీ లేకుండా చేశారు. జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానుంది. అలాగే 'అల వైకుంఠపురములో' జనవరి 12న విడుదల కానుంది.

ఈ నిర్ణయంతో మొత్తానికి రెండు రోజులు రెండు కొత్త సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఇలా ఈ సంక్రాంతిని ఇద్దరు స్టార్ హీరోలు పంచే వినోదంతో ప్రేక్షకులు వరుసగా రెండు రోజులను ఫుల్ గా ఎంజాయ్ చేయనున్నారు. పైగా ఈ సినిమాలకు ముందు 9న రజనీ 'దర్బార్' విడుదలకానుంది. అలాగే పెద్ద సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ కూడా మంచి ధీమాతో జనవరి 15న దిగుతున్నాడు.

Next Story