లైవ్ లెజెండ్స్ కాన్‌స‌ర్ట్‌ షో..!

By అంజి  Published on  1 Dec 2019 3:40 AM GMT
లైవ్ లెజెండ్స్ కాన్‌స‌ర్ట్‌ షో..!

లైవ్ లెజెండ్స్ కాన్‌స‌ర్ట్‌ షో జన సముద్రంతో నిండిపోయింది. ఈ కార్యకమంలో ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళ సాయి సౌందర్య రాజన్, ఐపీఎస్‌ శిఖా గోయల్, ఐఎఏస్‌ జయశ్ రంజన్, సింగర్ సునీతా, పలురు సినీ గాయ‌కులు పాల్గొన‌నారు. కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఆ ముగ్గురు దేదీప్య‌మానంగా వెలిగే తార‌లు. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో ఎల్‌బి స్టేడియంలో జరిగిన సంగీతం సంగ్రామంతో మారుమ్రోగింది.

ఈ కార్య‌క్ర‌మానికి వేరే వేరే రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 20 మంది వాద్య బృందం స‌భ్యులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు కలయికలో ఇండియా లోనే మొట్ట మొదటి సంగీతం లైవ్ కాన్ సర్ట్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుక‌లో తెలంగాణ రాష్ట్ర‌ గవర్నర్ మాట్లాడుతూ... నాకు ఈ పాటలు అంటే చాలా ఇష్టం. నాకంటే మా నాన్న గారికి ఇంకా ఇష్టం. ఏసుదాస్ గారు సంగీతానికి దేవుడు ఇచ్చిన వరం. బాలు గారి పాటలు చాలా బాగుంటాయి. గాన కోకిల‌ చిత్ర గారి పాట‌లు విన‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను అని చెప్పారు.

Efc4b9ab 995b 4486 B897 97dda5b2b249

Next Story
Share it