అనుష్క 'నిశ్శ‌బ్దం' ఓ స‌రికొత్త రికార్డ్ - కోన వెంక‌ట్.

By Newsmeter.Network  Published on  3 Dec 2019 7:12 AM GMT
అనుష్క నిశ్శ‌బ్దం ఓ స‌రికొత్త రికార్డ్ - కోన వెంక‌ట్.

అనుష్క న‌టించిన తాజా చిత్రం 'నిశ్శ‌బ్దం'. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. జ‌న‌వ‌రి 31న 'నిశ్శ‌బ్దం' ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను కోన వెంక‌ట్ తెలియ‌చేసారు.

కోన మాటల్లో... “2017లో ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఇద్ద‌రం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్ర‌యాణంలో అనుకోని మంచి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. మేం న‌మ్మిన ఈ క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్ గారు దొరికారు.

మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించారు. ఈ విధంగా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేసిన‌ తొలి తెలుగు సినిమాగా 'నిశ్శ‌బ్దం' ఓ రికార్డ్ క్రియేట్ చేసింద‌ని చెప్ప‌చ్చు. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా ఈ సినిమాకు పని చేశారు. అలాంటి నిర్మాత దొర‌క‌డం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. ఏద‌డిగినా కాద‌న‌కుండా.. అది అయ్యేంత‌ వ‌ర‌కు మా వెనుక‌ప‌డ‌తారు. మంచి క్వాలిటీ ప్రొడ్యూస‌ర్‌. మ‌న టెక్నీషియ‌న్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా ప‌నిచేయ‌డం వ‌ల్ల కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాం. స్క్రీన్ ప్లే చాలా కొత్త‌గా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

Next Story
Share it