నాగ శౌర్య 'అశ్వ‌థ్థామ‌' టీజ‌ర్ వ‌చ్చేస్తోంది

By Newsmeter.Network  Published on  26 Dec 2019 11:01 AM GMT
నాగ శౌర్య అశ్వ‌థ్థామ‌ టీజ‌ర్ వ‌చ్చేస్తోంది

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'అశ్వ‌థ్థామ‌'. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. సినిమా హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు కూడా.

ప్ర‌స్తుతం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా 'అశ్వ‌థ్థామ‌' టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస‌ర్ట్స్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, నిన్నే నిన్నే అనే ఫ‌స్ట్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ క ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమా పై నాగ‌శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మ‌రి... ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Next Story
Share it