తెలుగువారు సంతోషంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, మన ‘టాలీవుడ్‘ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించుకుంది. అవునండీ, టాలీవుడ్ అనే పదాన్ని ఆక్స్ ఫర్డ్ లో చేర్చారు.

Tollywood in Oxford Dictionary

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ (ఓఈడి) వారు 2019 లో చేరుతున్న కొత్త పదాల జాబితాను అక్టోబర్ 11న విడుదల చేసారు. వాటిలో టాలీవుడ్ కూడా ఉండడం విశేషం. ఓఈడిలో టలీవుడ్ ని ‘తెలుగు భషా చిత్ర పరిశ్రమ’ అని నిర్వచించారు.

ఇది ఎంతో అద్భుతమైన విషయం ఎందుకంటే, మన టలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుందని అర్ధం. అమెరికా, బ్రిటెన్ వంటి దేశాలలో తెలుగు సినిమాలు అద్భుతంగా నడుస్తున్నాయని కూడా తెలుస్తోంది. అంతే కాకుండా, అందులో టాలీవుడ్ తలంగాణ లోని హైదరాబాద్ లో అధారితమై ఉందని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉండడం వల్ల కొత్తగా ఏర్పాటు అయిన మన తెలంగాణ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది.

కాలిన్స్ ఇంగ్లిష్ డిక్షనరీ లో టలీవుడ్ ఎప్పుడో చోటు సంపాదించుకుంది, కానీ అందులో టాలీవుడ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉందని పేర్కొన్నారు. ఆక్స్ ఫర్డ్ లో మాత్రం తెలంగాణ లోని హైదరాబాద్ లో ఉందని పేర్కొన్నారు.

Tollywood in Oxford Dictionary

భారత దేశంలో టాలీవుడ్ అని ఇంకొక చిత్ర పరిశ్రమ ఉందని మీకు తెలుసా? ఆక్స్ ఫర్డ్ ప్రకారం, బెంగాలి చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని అంటారట. కోల్కతా లోని టాలీగంగ్, టలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమ అంటూ టలీవుడ్ కి రెండు నిర్వచనాలు ఇచ్చింది ఓఈడి .

ఓఈడి ప్రతి నాలుగు నెలలకూ కొన్ని కొత్త పదాలు చేర్చుకుంటుంది. వీటిలో ఎన్నో భారత దేశ పదాలు చేరాయి. అంబారీ, సత్తా, అంగామి, అంగ్రేజ్ వంటి పదాలు కూడా ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ లో ఉన్నాయి.

సత్య ప్రియ బి.ఎన్