విజయ్ తో దిల్ రాజు మూవీ. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?
By Newsmeter.Network Published on 5 Dec 2019 5:59 PM IST
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేమికుల రోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా తర్వాత విజయ్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే.. దిల్ రాజుతో సినిమా. దిల్ రాజు ఎప్పటి నుంచో విజయ్ తో సినిమా చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు.
ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని తెలిసింది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ సినిమాకి హుషారు సినిమాని తెరకెక్కించిన శ్రీ హర్ష దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తి వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.