అనాథ పిల్లలకు సినిమా చూపించిన 'వెంకీ మామ'

By Newsmeter.Network  Published on  24 Dec 2019 11:03 AM GMT
అనాథ పిల్లలకు సినిమా చూపించిన వెంకీ మామ

అనాథ పిల్లల పైన తనకున్న ప్రేమను మరోసారి చూపించారు విక్టరీ వెంకటేష్ . కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంన్న హీరోగా వెంకటేష్ కి మంచి గుర్తింపు ఉంది. అలాంటి హీరో క్రిస్మస్ కు ఒకరోజు ముందుగానే అనాథ పిల్లలకు కానుకలు ఇచ్చాడు. అదేవిధంగా వారి కోసం వెంకీ మామ సినిమను ప్రత్యేక స్క్రీనింగ్ ను ఏర్పాటు చేసి సందడి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ సందర్భంగా వెంకటేష్.. పిల్లలను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. వీటికి సంబందిచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సంవత్సరం 'ఎఫ్ 2' సినిమాతో విజయాన్ని అందుకున్న వెంకటేష్ అదే ఊపుతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా 'మజిలీ' సినిమాతో ఈ ఏడాది నాగ చైతన్య కూడా విజయన్ని అందుకున్నాడు. నిజంగానే మామ అల్లులు అయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు.. మామ అల్లులుగా నటించి మెప్పించిన చిత్రం వెంకీ మామ. ఈ నెల 13 న విడుదలై ఘన విజయం అందుకుంది. సినిమా విజయం సాధించినదుకుగాను రాశి ఖన్నా, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ కు వెంకటేష్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.Next Story
Share it