చిరు బయోపిక్ నా వల్ల కాదు - సాయితేజ్
By Newsmeter.Network Published on 8 Dec 2019 6:29 PM IST
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. ఏ వుడ్ లో అయినా ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే.. బయోపిక్ ల ట్రెండ్. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానటుడు, మహానటి... రీసెంట్ గా జార్జిరెడ్డి.. ఇలా బయోపిక్ లు తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే. సినిమా తారలు, రాజకీయ నాయకులు ఇలా.. వివిధ రంగాల్లో విజయం సాధించిన వాళ్ల జీవిత చరిత్ర తెర పైకి వస్తుంది.
ఇలా బయోపిక్ లు తెర పైకి వస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ వస్తే బాగుంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే... మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ప్రతి రోజు పండగే. యువ దర్శకుడు మారుతి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సాయితేజ్ ను చిరంజీవి బయోపిక్ గురించి అడిగితే.... మావయ్య బయోపిక్ వస్తే బాగుంటుంది. అయితే... మావయ్య పాత్రకు నేను న్యాయం చేయలేను రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా న్యాయం చేస్తాడు అంటూ తన మనసులో మాటలను బయటపెట్టాడు. మరి.. రామ్ చరణ్ ఏమంటారో..?