టాలీవుడ్‌ డార్లింగ్‌ 'ప్రభాస్‌' స్పెష‌ల్ స్టోరీ: పార్ట్ 4

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 9:48 AM GMT
టాలీవుడ్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ స్పెష‌ల్ స్టోరీ: పార్ట్ 4

టాలీవుడ్‌లో ఈ సినిమా టీజర్‌, ట్రైల‌ర్, ప్రభాస్‌ లుక్స్‌ ప్రేక్షకుల్లో సినిమా పై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ప్రభాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా మేకింగ్‌ కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గ లేదు. యాక్షన్‌ థ్రిల్లర్‌ల కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌తో పాటు బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్ వ‌ర్క్ చేశారు. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటించింది. అయితే... ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ డే రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది కానీ.. సినిమాలో బాలీవుడ్ యాక్ట‌ర్స్ ఎక్కువుగా ఉండ‌డం.. క‌థ లేక‌పోవ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

బాలీవుడ్‌ క్రైజ్‌:

కానీ బాలీవుడడ్‌లో మాత్రం సాహో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు.. ప్ర‌భాస్‌కి బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో. ఇప్పుడు ప్రభాస్‌ టాలీవుడ్‌ హీరో కాదు.. ఆల్‌ ఇండియా స్టార్‌. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఆయ‌న సినిమాలు నిర్మాణం జరుపుకోనున్నాయి. ఇటు యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు.. మాస్‌ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

న్యూ మూవీ:

ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో సీనియర్ హీరో, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని గ్రాండియర్ ప్రొడక్షన్స్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. టెక్నీకల్‌గా హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం ఉండనుంది.

ప్రత్యేకతలీవే:

బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస… ప్రొడక్షన్ డిజైనింగ్ లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్. తనదైన షార్ప్ ఎడిటింగ్‌తో ఎన్నో అద్భుతమైన హిట్స్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం తాజా షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో ప్లాన్ చేశారు. వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డార్లింగ్‌ ప్ర‌భాస్... మ‌నంద‌రం గ‌ర్వ‌ప‌డేలా భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Next Story
Share it