న్యూస్‌మీటర్‌ టాప్‌ -10 న్యూస్‌

By సుభాష్  Published on  29 Aug 2020 4:50 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ -10 న్యూస్‌

ఏపీలో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటాయి. గడిచిన 24గంటల్లో 61,331 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,526 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,03,616కి చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

కరోనా కాలంలో వివాహం చేసుకునే వారికి ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ముహూర్తాలు కుదుర్చుకున్న కొందరు పది, పదిహేను మందితోనే పెళ్లి జరుపుకొంటున్నారు. ఈ మాట అటుంచితే.. సందట్లో సడేమియా అన్నట్లు ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిపోయిందని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ వెల్లడించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

జపాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షింజో అబె

జపాన్‌ ప్రధాని షింజో అబె తన పదవికి రాజీనా చేశారు. అనారోగ్య కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. షింజో అబె వయసు 65 సంవత్సరాలు. 2021 సెప్టెంబరు వరకు ప్రధానిగా ఆయన పదవీకాలం ఉంది. తన పదవీకాలం పూర్తి చేయలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తన అనారోగ్యం కారణంగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుపల అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్సారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఆ క్రికెటర్ కొట్టిన భారీ సిక్సర్.. అతడి కారు అద్దాలనే ధ్వంసం చేసింది

కొందరు ఆటగాళ్లకు భారీ సిక్సర్లు కొట్టడం అలవాటు..! అలా కొట్టడం వలన కొన్ని సార్లు గ్రౌండ్ లో ఉన్న అభిమానులకు కూడా గాయాలు అయ్యేవి. మరికొన్ని సార్లు గ్రౌండ్ బయట ఉన్న వస్తువులకు తగిలి జరగాల్సిన నష్టం జరిగిపోయేవి. ఎన్నో సార్లు ఎంతో మంది ఆటగాళ్లు కార్ల అద్దాలు పగులకొట్టారు. ఈసారి ఐర్లాండ్ క్రికెటర్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4

తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పండగేనని చెప్పాలి. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా ముగిసి.. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తమ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

అవును సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గంజాయి కొట్టేవాడు: రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక డ్రగ్స్ కోసం కూడా ఉందని కథనాలు వచ్చిన సంగతి తెల్సిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గంజాయి తీసుకునే వాడంటూ చెప్పుకొచ్చింది. సుశాంత్ గంజాయి(Marijuana) తీసుకునేవాడు. ఆ అలవాటును కంట్రోల్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

మహేష్‌పై మళ్లీ బన్నీదే పైచేయి..

ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే మహేష్ బాబు ముందు.. అల్లు అర్జున్ తక్కువగానే కనిపిస్తాడు. మహేష్ ఎప్పుడో 'ఒక్కడు'తోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత 'పోకిరి', 'దూకుడు', 'శ్రీమంతుడు' లాంటి సినిమాలో బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపి, రికార్డుల దుమ్ము దులిపి అసలైన సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఇండోర్‌ను టాప్‌లో నిలిపిన తెలంగాణ బిడ్డ

ఇండోర్‌ మరోసారి పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలుచుంది. ఇలా ర్యాంకు సాధించడం నాలుగోసారి. ప్రభుత్వాధికారులు, ప్రజలు నాయకులు కలిసికట్టుగా విజయమిది. ఈ గెలుపు వెనక ఓ హీరో నిరంతర శ్రమ కూడా ఒదిగి ఉంది. అతనే అప్పటి ఇండోర్‌ కలెక్టర్‌ , ప్రస్తుత మధ్యప్రదేశ్‌ ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ పరికిపండ్ల నరహరి . ఇండోర్‌ అద్దంలా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌కు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోంది: భారత్‌

పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌కు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్‌ ఆరోపించింది. పాక్‌కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్‌కు ఆ దేశం మద్దతు ఇస్తూనే ఉందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Next Story