ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్లు

By సుభాష్  Published on  15 May 2020 7:32 AM GMT
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్లు

ముఖ్యాంశాలు

  • తగ్గిన ఉమ్మడి కుటుంబాలు.. పెరిగిన ఒంటరి జీవితాలు

  • నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటుంటారు. అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి యేటా మే 15న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1994 నుంచి ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాము.

యూఎస్‌ జనరల్‌ అసెంబ్లీ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యత గుర్తించి 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. ఈ విశాలమైన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎంతో ముఖ్యమని, కుటుంబ వ్యవస్థలో ఉన్న అడ్డంకులు పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కోరారు. ఒక మంచి కుటుంబం ఒక మంచి సమాజాన్ని నిర్మించే శక్తి ఉంటుంది. ఒకప్పుడు దేశంలో ఎన్నో మంచి కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం కాలం మారిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, ఆసూయ, గొడవలు, మనస్పర్థలు.. ఇలా ఎన్నో కారణాలు కుంటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అయితే కొన్ని కొన్ని కుటుంబాలు చిన్న కుటుంబమే చింత లేని కుటుంబంగా కనిపిస్తుంటాయి.

ఉమ్మడి కుటుంబాలు

ఎన్ని అటుపోట్లు ఎదురైనా.. ఎన్ని గొడవలు జరిగినా ఇప్పటికి మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాలు ఆర్థిక స్థితిగదులను చెదరగొడుతూ భారతదేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ప్రేమానురాగాలు, అప్యాయతలు అనుబంధాలతో వర్థిల్లుతున్నాయి. అయితే పూర్వకాలంలో పోలిస్తే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు.

ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. ఇప్పుడు చిన్న కుటుంబాలదే రాజ్యంగా మారిపోయింది. ఒకప్పుడు ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మంది సంతానం ఉండేది. ఇప్పుడు ఒకరిద్దరితో సరిపోతుంది. ఎందుకంటే అప్పుడున్న ఖర్చులు, ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు లేవు. సంపదన తక్కువ.. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దుబార ఖర్చులు ఎక్కువవుతున్నాయి. తినే తిండిలో కూడా మొత్తం కల్తీయే. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. చాలా మంది మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలను వెతికితే మచ్చుకు కొన్ని మాత్రమే కనబడుతుంటాయి. వాటి విలువ ఏంటో ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతోంది. కరోనా కారణంగా నిండు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. ఇందుకు ఐక్యరాజ్యసమితి కూడా నడుం బిగించింది. అందుకే కుటుంబ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దిననోత్సవం ప్రకటించింది.

పరిమితి కుటుంబాల సంఖ్యతో పని భారం

అయితే ప్రస్తుతం పరిమితి కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో చాలా మందికి పని భారం పెరిగిపోతోంది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా..పిల్లలకు, మహిళలకు, పెద్దలకు ఒంటరితనం తప్పడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఈ పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, మాధుర్యం అందులో నేర్చుకునే విలువైన పాఠాలు భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్పుతుంది. కుటుంబ విలువలు నైతిక ప్రమాణాలు పెద్దలంటే గౌరవంతో పాటు కుటుంబ బాధ్యతలు, మార్యదలు, సంతానంలో ఎదిగే పిల్లలకు మంచి, చెడు అవగాహన కలిగి వారి నడవడిక ఇంకా మెరుగైన పద్దతులు నేర్చుకునే వెసులుబాటు ఉండేది.

ఉమ్మడి కుటుంబాలు తగ్గి.. ఒంటరి జీవితాలు పెరిగి..

అలాగే కుటుంబ పోషణ కోసం భార్యాభర్తలు రెండు చేతుల సంపాదించినా తేరుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో. ఒకచోట కూర్చుని ఒకరినొకరు మాట్లాడుకునే సమయం కూడా తక్కువే. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో ఒంటరి జీవితాలు ఎక్కువైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబంలో కలివిడిగా ఉండే తత్వం లేని సమయంలో కొత్తగా పెళ్లైన వారికి వేరే కాపురాలు పెట్టాలని, ఒంటరిగా కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.

అందుకు తోడు సలహాలు ఇచ్చే పెద్ద దిక్కులు కూడా లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కూడా కరువవ్వడం నేటి సమాజంలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, ప్రాధాన్యత, రక్త సంబంధంతో వారందరినీ ఒక కుటుంబంలా అంతా కలిసి ఉండేందుకు కుటుంబంలోని పెద్దాయన బాధ్యత తీసుకున్నరోజూ ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

కరోనా కాలంలో కుటుంబాల్లో ధనిక, పేద తేడా లేకుండా ఇంటి సభ్యులంతా కుటుంబంతో గడిపే అవకాశం లభించింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరిగాయి. అంతేకాదు పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. కుటుంబంలో కష్టపడుతున్న మహిళలకు ఇంటిల్లిపాదిగా గౌరవించే అవకాశం ఏర్పడింది. చిన్నారులు పెద్దల మాట వినే అవకాశం దొరికింది. కుటుంబ వ్యవస్థ బలపడేందుకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. కరోనా మహమ్మారి భారతీయ కుటుంబాలకు సవాళ్లనూ విసిరింది.

Next Story