భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

By సుభాష్  Published on  26 Jun 2020 12:27 PM IST
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. రోజురోజుకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక బంగారం ధర తగ్గితే, వెండి కూడా అదే దారిలో వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయంగా ధర దిగివచ్చింది.

ఢిల్లీలో..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బంగారం ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి.. ప్రస్తుతం రూ.46,800లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గుతూ రూ.48,060కు చేరుకుంది. ఇక వెండి కిలోపై రూ.860 దిగొచ్చి ప్రస్తుతం రూ.47,700లకు చేరుకుంది.

హైదరాబాద్‌లో..

ఇక హైదరాబాద్‌లో కూడా బంగారం ధర క్షిణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 తగ్గుతూ ప్రస్తుతం రూ.46,160కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గుతూ ప్రస్తుతం రూ.50,360కి చేరుకుంది.

ఇక ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం తదితర కారణాలు ధర మార్పులకు కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైచూపులు చూస్తోంది. బంగారం ధర ఔన్స్‌ కు 0.24 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌ కు 1774 డాలర్లకు చేరుకుంది. ఇక వెండి కూడా అంతే. వెండి ధర ఔన్స్‌ కు 0.02శాతం పెరుగుదలతో 17.90 డాలర్లకు ఎగబాకింది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు..

ఇక బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ బంగారం ధరల్లో మార్పు, బంగారం నిల్వలు, జువెలరీ మార్కెఎట్‌, వాణిజ్య యుద్దాలు, చైనా-భారత్‌ ఉద్రిక్తతలు తదితర కారణాలు పసిడి ధరలపై ప్రభావం బాగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story